1994-98 మధ్యలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేసాను. 2001-2005 మధ్యలో దేవీ మహాత్మ్యం/దుర్గా సప్తశతిని 108 మార్లు పారాయణ చేసాను. ఆ తరువాత, దేవీ మహాత్మ్యం/దుర్గా సప్తశతి పారాయణ చేయలేకపోయాను.
2009-2015 మధ్యప్రాంతంలో రామాయణం చదవడం ప్రారంభించాను. రామాయణంపై నా ఆలోచనలను ఒక Blogలో పెట్టడం అప్పుడే ప్రారంభించాను.
ప్రస్తుత ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న వేంకటపాలెంలో, ఉండే శ్రీ అవధూత పోలయ్య స్వామిని 2015లోను , 2018లో ఆ స్వామిని ఇంకొకసారి దర్శించిన తరువాత, ఎందుకో ఋగ్వేదం మీదకు మనస్సు మళ్ళింది.
ఆ స్వామి తరువాత సమాధి చెందారు.
2023 ప్రాంతంలో, ఎవరో ప్రేరేపించినట్లు అంతవరకు ఋగ్వేదాన్ని ఎవరు స్పృశించని కోణాలలోకి వెళ్ళాను.
సంస్కృత భాషలో ఉద్ధండులైన చాలా మంది స్ఫురించని కోణంలో ఋగ్వేద ఋషుల ఆలోచనలలోని సరస్వతీ, ఉర్వశి, అదితి, ఉష వంటి స్త్రీ శక్తుల ఆంతర్యం అవగాహనకు వచ్చింది.
ఋగ్వేదంలో సంకేతార్థంతో చెప్పిన ఉర్వశి, పురూరవుల కథ వంటివి వేరే కోణంలో ఎలా చూడాలో అర్థమైంది.
అంతర్జాలంలో (Internet) పరిశీలిస్తే, ఎవరు కూడా ఈ కోణంలో చెప్పలేదని అర్థమైంది.
ఈ రకమైన అవగాహన నాకు లభించడం బహుశ: భగవంతుని సంకల్పం.
🙏🕉
No comments:
Post a Comment