Thursday, 6 March 2025

పుత్రుడు

మనుస్మృతి 9.138


పున్నామ్నో నరకాద్ యస్మాత్ త్రాయతే పితరం సుతః ।
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః స్వయమేవ స్వయమ్భువా ॥

పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు అని స్వయంభువుడే (బ్రహ్మ) చెప్పాడు.

---

పుత్ర = పు+త్ర - త్ర (పుంలింగం) అంటే రక్షించడం.

ఐతే, పుత్రి అంటే ఇదే అర్థం వస్తుంది.

పుత్రి = పు + త్రి - త్రి (స్త్రీ లింగం) అంటే కూడా రక్షించడం.

--

తైత్తిరీయోపనిషద్ 1.11.1లో, గురువు విద్యాభ్యాసం పుర్తి చేసుకున్న విద్యార్థికి ఇచ్చే సూచనలు.

సత్యం పలకమని, ధర్మమార్గం వదలవద్దని, ధనం సంపాదించమని చెబుతు చెప్పిన మాట.

ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః - (వివాహం చేసుకుని) మీ వంశాన్ని కొనసాగించు .

--

అందులో వంశాన్ని కొనసాగించమని చెప్పారు కానీ, పుత్రుడి ద్వారానే అని చెప్పినట్లు కనబడలేదు.  చాలా సందర్భాలలో  పుత్రిక సంతానమే మాతామహుడి పేరుని కొనసాగించినట్లు ఉంది.

అదీ కాక, మనుస్మృతికి ముందు వచ్చిన ఋగ్వేదంలో పుత్రుడి ప్రస్తావన ఉన్నా,  అక్కడ నరకం అనే దాని గురించి ప్రస్తావనే లేదు.  

---

కాబట్టి, పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు అనే ఆలోచన తరువాత కాలంలో మొలకెత్తి, వ్యాప్తి చెందినట్లు అనిపిస్తోంది.

No comments:

Post a Comment