పరబ్రహ్మను (అగ్నిని) మొదటగా అప్నవాన, భృగు ఋషులు దర్శించి, తరువాత అందరిలోను వ్యాపింపజేసారని ఋగ్వేదం చెబుతోంది.
ఈ ఋక్కును కూర్చిన ఋషి - వామదేవ గౌతమ
ఋగ్వేదం 4.7.1
అయమిహ ప్రథమో ధాయి ధాతృభిర్హోతా యజిష్ఠో అధ్వరేష్వీడ్యః ।
యమప్నవానో భృగవో విరురుచుర్వనేషు చిత్రం విభ్వం విశేవిశే ॥
అన్ని యజ్ఞాలలో (ఆధ్యాత్మిక సాధనలలో) ఆహ్వానించదగిన ఈ శక్తి (అగ్ని)ని, మొదటగా అప్నవాన, భృగు ఋషులు దర్శించి, తరువాత అందరిలోను వ్యాపింపజేసారు.
---
వామదేవ గౌతమ ఋషి ఎప్పటివారో తెలియదు. ఆయనయే, అప్నవాన, భృగు ఋషుల గురించి చెప్పారంటే, వారెంత ప్రాచీనులో మరి!
---
అప్నవాన ఋషి నుంచి ఆప్నవానులు వచ్చారు.
భృగువు ఋషి నుండి భార్గవులు వచ్చారు.
------
అంటే ఈనాడు మనం వాడుతున్న ఎన్ని రకాల గోత్రాలలో ఆప్నవాన, భార్గవ ఋషులు కనిపిస్తారో నాకు తెలియదు కానీ, ఈ గోత్ర ఋషులందరికి మూల ఋషులు మాత్రం అప్నవాన, భృగు ఋషులని పై ఋగ్వేద ఋక్కువలన తెలుస్తోంది.