ఋగ్వేదం 4.30.24లో ఋషి వామదేవుడు ఒక చిత్రమైన ప్రయోగం చేసారు. ఇది ఇంద్రుని పరంగ చెప్పిన సుక్తము.
వామంవామం త ఆదురే దేవో దదాత్వర్యమా ।
వామం పూషా వామం భగో వామం దేవః కరూళతీ ॥
ఓ ఆదురి! మీకు విలువైనదాన్ని అర్యమాన్, పూషణుడు,భగుడు మరియు దంతములు లేని దేవుడు ఇస్తారు.
--
ఆదురి అంటే ఇంద్రుడు.
వామ అంటే విలువైనది/ఆనందాన్ని కలిగించేది అని .
కరూళతీ - దంతములు లేని (లేదా) దంతాలు విరిగిన/దూరంగా ఉన్న అని అర్థాలు చెప్పారు.
దేవః కరూళతీ - దంతములు లేని (లేదా) దంతాలు విరిగిన/దూరంగా ఉన్న దేవుడు.
---
తైత్తరీయ బ్రాహ్మణం 2.6.8.5లో ఒక యజ్ఞ హవిస్సును స్వీకరించినపుదు పూషణుడి దంతాలు అన్నీ పోయినట్లు ఉంది. ఈ కథకు ఆధారమేమిటో, దీని సంకేతార్థమేమిటో చెప్పలేదు.
దీనిని అనుసరించి, పురాణాలలో దక్షయజ్ఞ సందర్భంగా జరిగిన పోరులో, వీరభద్రుడు పూషణుడి దంతాలు పగులకొట్టాడనే కథ కల్పించారు.
పై కథల ఆధారంగా, ఋగ్వేద భాష్యం వ్రాసిన సాయనాచార్యుడు (14వ శతాబ్ధం), ఆ దంతములు లేని (లేదా) దంతాలు విరిగిన/దూరంగా ఉన్న దేవుడు పూషణుడు అని చెప్పారు.
---
గమనించవలసిన విషయమేమిటంటే, ఈ ఋక్కును అందించిన ఋషి వామదేవుడు అర్యమాన్, పూషణుడు,భగుడు మరియు దంతములు లేని దేవుడు అని చెప్పారు.
కాబట్టి, ఆ దేవత ఎవరు అనేది ఋగ్వేదాన్ని అధ్యయనం చేసేవారు అలోచించి అర్థం చేసుకోవాలని, ఋషి వామదేవుడు కావాలనే వదిలివేసినట్లు నాకనిపించింది.
---
నాకున్న కొద్దిపాటి బుద్ధిని ఉపయోగించడంవలన నాకు అర్థమైనదేమిటంటే, దంతములు లేని (లేదా) దంతాలు విరిగిన/దూరంగా ఎవరికి ఉంటాయి అని ఆలోచిస్తే, నెలల పసిపిల్లవాడు స్ఫురించాడు.
మనస్సుకు ఆహ్లాదం కలిగించే బోసినవ్వుతో ఉండే పసిపిల్లవాడిని సంకేతార్థంతో ఆలోచిస్తే, కొద్దికాలం క్రితమే ఆత్మసాక్షాత్కారమైనపుడు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించే, పసిపిల్లవాడిలాంటి పరబ్రహ్మ స్ఫురించాడు.
--
బ్రహ్మార్పణమస్తు.
No comments:
Post a Comment