ఋగ్వేదంలో ఋషులు అనేకమార్లు సోమం గురించి ప్రస్తావించారు. ఋగ్వేదంలోని 9వ మండలం మొత్తం సోమం గురించే ఉంటుంది.
చాలమంది అనువాదకులు సోమం అంటే ఒక తీగయని, దాని రసాన్నే ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు త్రాగేవారని చెప్పారు.
శ్రీ అరవిందులు సోమం అంటే స్త్రీ పురుష శక్తుల సమ్మేళనమైన పరబ్రహ్మ చైతన్యమని సూచించారు.
---
సోమ = స + ఉమా
అంటే ఉమాతో కూడిన అని అర్థం.
ఉమా అంటే దివ్యమైన తేజస్సు.
--
ఋషులు ఋగ్వేదంలో సోమం అనే పదాన్ని స + ఉమా అనే అర్థంతో వాడినా, ఉమా అనే పద ప్రయోగం నేరుగా కనిపించదు.
ఐతే, ఋగ్వేదంలో ఊమ అనే పద ప్రయోగం కనిపిస్తుంది.
ఊమ అంటే మంచి స్నేహితుడు అని అర్థం.
--
*దివ్యమైన తేజస్సు* అనే అర్థం వచ్చే *అదితి, ఉష,* మొదలైన పదాలు వాడినా, సోమ అనే వాడారు.
---
ఐతే, ఉమా అనే పదంలోని ప్రత్యేకత ఏమిటంటే, అందులో 2 స్వరాలు(vowels), 1 వ్యంజనం (consonant) ఉంటాయి.
ఉ+మ్ +ఆ
--
ఋగ్వేదంలో 3 స్త్రీ శక్తుల (సరస్వతీ, ఇళ, భారతి) ప్రస్తావన చాలాసార్లు కనిపిస్తుంది.
ఉదాహరణకు: త్రయంబకం (ముగ్గురు తల్లులు కలిగిన), తిస్రో దేవీః (3 దివ్య శక్తులు)
---
మూడు(3) స్త్రీ శక్తుల (సరస్వతీ, ఇళ, భారతి) సమ్మిళిత శక్తియే ఉమా.
---
ఉమా అనే పదంలో కూడా 3 అక్షరాలు - (2 స్వరాలు - ఉ, ఆ - (vowels), 1 వ్యంజనం - మ్
(consonant)) ఉంటాయి.
ఉ+మ్ +ఆ = ఉమా
---
ఈ మూడు(3) స్త్రీ శక్తుల (సరస్వతీ, ఇళ, భారతి) సమ్మిళిత శక్తినే, ఋషులు 2 స్వరాలు(vowels), 1 వ్యంజనం (consonant)గా ఉన్న ఉమా అనే పదాన్ని వాడారనిపిస్తోంది.
అందువలన నాకు స్ఫురించిన విషయమేమిటంటే, ఋషులు ఈ ఉమా పదాన్ని కావాలనే ఎంచుకున్నారు.
No comments:
Post a Comment