Thursday, 13 February 2025

ఋగ్వేదంలో ఆధ్యాత్మిక కథ

 Lord Indra - the king of Gods - Indra ...

ఋగ్వేదంలో ఒక కథ రూపంలో నర్మగర్భంగా ప్రజలకు ఋషులు అందించిన ఆధ్యాత్మిక విషయంలోని ముఖ్యమైన అంశాలు.

 

1. గోవులను/నీటిని అడ్డుకునే లేదా దొంగిలించే దస్యులను పణీలు (पणयः) అంటారు. వారి అధిపతి వలుడు అనే రాక్షసుడు. వలుడు పర్వతాలలో ఒక గుహలో, రంధ్రం (బిలం)లో నివసిస్తాడు.

 

2. ఆవుల/నీటి జాడను కనుగొనవలసిన బాధ్యత సరమ అనే దేవతల దివ్యమైన దూతపై ఉంటుంది.

 

3. ఇంద్రుడు మరియు అంగీరస ఋషులు గోవులను/నీటిని  తిరిగి పొందేందుకు సరమ తెలియజేసిన జాడననుసరించి చీకటి గుహను చేరిన తరువాత, అంగీరస ఋషులు నిజమైన పదం/మంత్రాన్ని జపించాలి.

 

4. ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి కొండపై బలమైన ప్రదేశాలను బద్దలుచేసి తెరిచి, పణీలను ఓడించి, దాచిన సూర్యుని కిరణాలు విడుదల చేయబడి,  గోవుల మందలను/నీటిని పైకి నడుపుతారు.

 The Sampradaya Sun - Independent Vaisnava News - Feature Stories - February  2014

5. ఇంద్రుడికి విష్ణువు లేదా పూషణుడు (సూర్యుడికి మరోపేరు) తోడుంటారు.  పూషణుడిని ఇంద్రుడికి సోదరుడు అని ఋగ్వేదం వర్ణిస్తోంది.

 -----

 ఋగ్వేదంలో నర్మగర్భంగా చెప్పిన ప్రతి ఆధ్యాత్మిక అంశం క్రింద, నాకు అర్థమయినంతవరకు వివరణ ఇస్తున్నాను.

 1. గోవులను/నీటిని అడ్డుకునే లేదా దొంగిలించే దస్యులను పణీలు (पणयः) అంటారు. వారి అధిపతి వలుడు అనే రాక్షసుడు. వలుడు/వృత్రుడు పర్వతాలలో ఒక గుహలో, రంధ్రం (బిలం)లో నివసిస్తాడు.

-----

 గోవులు/నీరు అంటే ప్రకాశము లేదా తేజస్సు లేదా జ్ఞానంగా చెప్పవచ్చును.

 యోగంలో  మామూలు కంటికి కనిపించకుండా మూలాధార చక్రంలో నిద్రిస్తూ ఉండే కుండలనీ శక్తి గురించి చెబుతారు.   దీనినే ప్రతి మనిషిలోను, మరుగునపడిన జ్ఞానంగా చెప్పవచ్చును.

  మనిషిలోని బలహీనతల/ప్రారబ్ధకర్మ (అడ్డంకులు/జ్ఞానం) వల్ల కుండలనీ శక్తిగా/జ్ఞానం జాగురుకతతో లేకపోవడంగా అనుకోవచ్చును.

 వృత్ర అంటే శత్రువు లేదా ఆటంకము అనే అర్థాలు ఉన్నాయి.

 వలుడు అంటే వల అంటే బంధనము అని అర్థం.  ఇక్కడ మానసిక బంధనము అని అనుకోవచ్చును.

 -----

 2. ఆవుల/నీటి జాడను కనుగొనవలసిన బాధ్యత సరమ అనే దేవతల దివ్యమైన దూతపై ఉంటుంది.

 సరమ అనే దేవతల దివ్యమైన దూత అంటే ప్రతి మనిషిలోను ఉండే అంతర్వాణిగా (intuition) అర్థం చేసుకోవచ్చును.

 

బలహీనతలు/ప్రారబ్ధకర్మలను (అడ్డంకులు/జ్ఞానం) అధిగమించే మార్గనిర్దేశం అంతర్వాణి (intuition) చేస్తుంది.

 -------

 3. ఇంద్రుడు మరియు అంగీరస ఋషులు గోవులను/నీటిని  తిరిగి పొందేందుకు సరమ తెలియజేసిన జాడననుసరించి చీకటి గుహను చేరిన తరువాత, అంగీరస ఋషులు నిజమైన పదం/మంత్రాన్ని జపించాలి.

 

ఇంద్రుడు అంటే బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తిగా అర్థం చేసుకోవాలి.  బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తి, అంటే ఇంద్రుని తోడు లేకుండా అజ్ఞానమును అంటే వలుడు/వృత్రుడిని అధిగమించలేము.

 అంగీరస ఋషులు ప్రతిమనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే సప్తౠషులు.  అంటే గురువు.  గురువు సహాయం లేకుండా బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తికూడా ఏమి సాధించలేదు. 

 బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తి అంటే ఇంద్రుడు మరియు అంగీరస ఋషులు, అంతర్వాణి (సరమ) సూచించిన చోటుకు చేరాలి.

 ---

 4. ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి కొండపై బలమైన ప్రదేశాలను బద్దలుచేసి తెరిచి, పణీలను ఓడించి, దాచిన సూర్యుని కిరణాలు విడుదల చేయబడి,  గోవుల మందలను/నీటిని పైకి నడుపుతారు.

బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తి అంటే ఇంద్రుడు ఆటంకాలను లేదా వృత్రుడు/వలుడిని అధిగమించిన తరువాత, గోవులను/నీటిని (ప్రకాశము లేదా తేజస్సు లేదా జ్ఞానం)  తిరిగి పొందేందుకు మనిషికి వీలు కలుగుతుంది.

 -----

 5. ఇంద్రుడికి విష్ణువు లేదా పూషణుడు (సూర్యుడికి మరోపేరు) తోడుంటారు.  పూషణుడిని ఇంద్రుడికి సోదరుడు అని ఋగ్వేదం (6.55.5) వర్ణిస్తోంది.   పూషణుడు సూర్యుని శక్తి.

 మాతుర్దిధిషుమబ్రవం స్వసుర్జారః శృణోతు నః భ్రాతేన్ద్రస్య సఖా మమ

 

ఇంద్రుని సోదరుడినినాకు తోడుగా చేయి.

 ---

ఒకసారి జ్ఞానం లభించిన తరువాత అది వెంటనే స్థిరపడదు.  జ్ఞానం స్థిరపడాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి (ఋగ్వేదం 4.57.7).

 ---

  ప్రయత్నానికి బలమైన ఇంద్రియ లేక మనో నిగ్రహ శక్తి అంటే ఇంద్రుడికి సహాయపడే శక్తియే పూషణుడు, అంటే ఇంద్రుని సోదరుడు.

No comments:

Post a Comment