Thursday, 13 February 2025

ఋగ్వేదంలో ఇంద్రుడు వృత్రుడిని చంపడం అద్వైతసిద్ధి

 VRITRA, Indra And Vritra Story- A Mighty Asura (demon) - VRITRA

 ఋగ్వేదంలోని ఒక ఋక్కుకు సామాన్య అనువాదకులైన సాయనాచార్యులు వంటి భారతీయులుగానీ/విదేశీయులుగానీ, అందించిన అర్థం ఇది.   ఇది ఇంద్రుడిని ఉద్దేశించి చెప్పినది. చెప్పిన ఋషి విశ్వామిత్ర గాథిన.

ఋగ్వేదం 3.30.8

సహదానుం పురుహూత క్షియన్తమహస్తమిన్ద్ర సం పిణక్కుణారుమ్ । 

అభి వృత్రం వర్ధమానం పియారుమపాదమిన్ద్ర తవసా జఘన్థ ॥


ఓ ఇంద్రా! (నా చేత) ప్రేరేపింపబడి, తన తల్లి దానుతో కలిసి నివసించే, చేతులు మరియు పాదాలు లేని, ధృడంగా పెరుగుతున్న  కీటకంవంటి వృత్రుడిని, నీవు పూర్తిగా నలిపివేసావు.

---

ఈ జీవిని చంపే ముందు ఇంద్రుడు సోమం త్రాగాడు. కొన్నిచోట్ల వృత్రుడికి బదులు శంబరుడని లేక ఇంకొక పామువంటి జీవిని గురించి ప్రస్తావించినా, కథ ఇదే ఉంటుంది. మరికొన్ని చోట్ల ఆ జీవిని ప్రపంచాన్ని కమ్మివేసిన మాయ (*విశ్వస్య మాయినా*) అని వర్ణించారు.


ఇది ప్రధానంగా చెబుతు, వృత్రుడు మరణించిన తరువాత, అతని అనుచరులను నశింపచేసినట్లు, అతని తల్లైన దానును కూడా చంపినట్లు ఉంది. తరువాత వృత్రుడు/శంబరుడు గుహలో బంధించిన గోవులను/నీటిని/కాంతిని విడుదల చేసినట్లు ఉంది. 

---

గుహలో గోవులను/నీటిని/కాంతిని బంధించిన ఆ పాము/వృత్రుడు/శంబరుడికి 


1) చేతులు మరియు పాదాలు లేవంట!

2) ప్రపంచాన్ని కమ్మివేసిన మాయట!

3) గుహలో  గోవులను/నీటిని/కాంతిని బంధించాడట!

4) జీవిని చంపే ముందు ఇంద్రుడు సోమం త్రాగాడట!

---

దేవతల రాజుగా, అతి బలవంతుడిగా, పుట్టగానే భూమిని ఆకాశాన్ని విస్తరించినవాడిగా ఋగ్వేద ఋషులు ఇంద్రుడిని కీర్తించారు.  


అటువంటి ఇంద్రుడికి చేతులు మరియు పాదాలు లేని ఒక పామువంటి జీవిని చంపడమేమిటి?  గుహలో బంధించిన గోవులను/నీటిని/కాంతిని విడుదల చేయడమేమిటి?

---

ఋగ్వేద ఋషులు చాలా నర్మగర్భంగా చెప్పిన ఆధ్యాత్మిక సందేశమిది.

---

వృత్రుడిని మనం అనుభవించే రాగద్వేషాల ద్వారా మనల్ని మోహింపచేసి, కంటికి కనిపించని, మనల్ని బంధించి ఉంచే మాయా శక్తిగా అనుకుంటే, ఇంద్రుడిని  ఆ మాయాశక్తిని అధిగమింపచేసే బలమైన ఇంద్రియశక్తిగా అర్థం చేసుకుంటే, ఆ మాయాశక్తిని అధిగమించిన తరువాత, మనలోనే దాగి ఉన్న జ్ఞాన దర్శనం బంధించిన గోవులను/నీటిని/కాంతిని విడుదల చేయడంగా అర్థం చేసుకోవచ్చును.


ఒకరకంగా ఇది అద్వైతసిద్ధిగా భావించవచ్చును.

No comments:

Post a Comment