Thursday, 13 February 2025

కర్మయోగం పాటించాలంటే కర్మనిష్ఠను భగవంతుడే ప్రసాదించాలా?

 

 

శ్రీకృష్ణుడు గీతలో కర్మయోగం గురించి చెప్పాడు.  

కర్మయోగం అంటేనే కర్మలు చేస్తూండాలి కానీ వాటి ఫలం ఆశించరాదు అని.  

ఎంత ఆలోచించినా, ఒక సాధకుడు తనంత తానుగా ప్రయత్నిస్తే, కర్మయోగంతో ఎలా జీవించగలడో అర్థం కాలేదు.  

--

శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఇలా అంటాడు.


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।


ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.

---

అభ్యాసము మరియు వైరాగ్యము అనేవి చదవడానికి, వినడానికి బాగుంటాయి.  ఆచరణలోకి వచ్చేసరికి, అప్పటివరకు ఫలమాసించి కర్మలు చేసినవాడిని, ప్రారబ్ధరూపంలో వచ్చే సుఖదు:ఖాలు ఆ జీవిని బంధించి, కోపంతోనో/ద్వేషంతోనో/ప్రేమతోనో/అభిమానంతోనో/అసూయతోనో కర్మలు చేసేటట్లుగా ప్రేరేపిస్తూంటే,  ఫలమాసించకుండా కర్మలు ఎలా చేయగలడు?

ఆ విధంగా ఫలమాసించకుండా కర్మలు చేయాలంటే, ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానికి మాత్రమే సాధ్యం లేదా ఆరకంగా కర్మలు చేయడానికి భగవంతుడే సాయం చేయాలి.  అంటే ఆరకమైన కర్మనిష్ఠను భగవంతుడే ప్రసాదించాలి.

ఇప్పటివరకు ఇదే నా అభిప్రాయం.

----

చిత్రంగా, నా అభిప్రాయాన్ని సమర్థించే ఋగ్వేదంలోని ఒక ఋక్కు నా కంట పడింది.

ఋగ్వేదం 10.80.1

అగ్నిః సప్తిం వాజమ్భరం దదాత్యగ్నిర్వీరం శ్రుత్యం కర్మనిష్ఠామ్ । 

“అగ్ని (తనను ఆశ్రయించినవాడికి) జ్ఞానాన్ని సంపాదించే వేగం ఇస్తాడు, అగ్ని (అతనికి)  పరాక్రమాన్ని, దానికి కావలసిన కర్మనిష్ఠను ఇస్తాడు;

 

No comments:

Post a Comment