ఋగ్వేదంలో అన్నింటికి ఆధారభూతమైన సవితృని (4.54.4;; 2.38.9) ప్రతిదినము 3 మార్లు ధ్యానిస్తే, ఇంద్రుడు, సింధు, ఆదిత్యులతో కూడిన అదితి, సాధకునికి రక్షణ కల్పిస్తారు, అని ఉంది.
ఋగ్వేదం 4.54.6
ఋషి వామదేవ ఋషి
యే తే త్రిరహన్త్సవితః సవాసో దివేదివే సౌభగమాసువన్తి ।
ఇన్ద్రో ద్యావాపృథివీ సిన్ధురద్భిరాదిత్యైర్నో అదితిః శర్మ యంసత్ ॥
------
ఇక్కడ సవితృని ప్రతిదినము 3 మార్లు ధ్యానించడం గురించి వామదేవ ఋషి చెబుతున్నారు.
దీనికి, ప్రతిదినము 3 మార్లు చేసే సంధ్యావందనానికి తేడా ఉంది.
------
సవితృని ప్రతిదినము 3 మార్లు ధ్యానించడమంటే, మానసిక ధ్యానమేకానీ భౌతికమైన కర్మకాండకు సంబంధంలేదు.
ప్రతిదినము చేసే సంధ్యావందనములో తప్పనిసరిగ నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీ మంత్రజపం ఉంటుంది.
------
రామాయణంలో కూడా, శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర ఋషి ప్రేరితులై సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీ మంత్రజపం ఉంటుంది.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || ౧-౨౩-౨
తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నరోత్తమౌ |
స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్ || ౧-౨౩-౩
No comments:
Post a Comment