ఒక స్త్రీ తన సోదరుని రక్ష కట్టే రక్షాబంధన కార్యక్రమంగా మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.
వ్రతాలు, యజ్ఞాలు మొదలైనవి చేసేటపుడు, రక్ష కట్టుకోవడం కూడా ఉంది.
---
పిల్లల/భర్త/దగ్గర బంధువుల శ్రేయస్సునాశించి పండితులచేత ఆశీర్వదింపజేయడం/రక్ష కట్టించడం మనకు ఉన్న ఆచారమే.
భవిష్యపురాణం ప్రకారం, శ్రావణపూర్ణిమనాడు, శచీదేవి తన భర్తైన ఇంద్రుడికి విజయంకోరి రక్ష కట్టినట్లు, అందువలన ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించినట్లు చెబుతారు.
----
రామాయణం ప్రకారం, వనవాసానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్న తన కుమారుడైన శ్రీరాముని ఆశీర్వదించి, రక్ష కట్టడం చదువచ్చును.
ఇతి పుత్రస్య శేషాశ్చ కృత్వా శిరసి భామినీ || ౨-౨౫-౩౭
గన్దాంశ్చాపి సమాలభ్య రామమాయతలో చనా |
ఓషధీమ్ చ అపి సిద్ధ అర్థామ్ విశల్య కరణీమ్ శుభామ్ || ౨-౨౫-౩౮
చకార రక్షామ్ కౌసల్యా మన్త్రైః అభిజజాప చ |
విశాలనేత్రయైన కౌసల్యా శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి, శిరమున మంత్రక్షతలను ఉంచెను. ఆయనకు గంధమాల్యములను అలంకరించెను. సకలకార్యసిద్ధిప్రదమైన "విశల్యకరణి" అను ఓషధితో తనయునకు రక్షాబంధనమొనర్చెను. సందర్భశుద్ధిగా పవిత్రమంత్రములను జపించెను.
No comments:
Post a Comment