ఋగ్వేదము 9.67.12 - ఋషి:: అత్రి : దేవత:: సోమం/పూషణుడు
అయం త ఆఘృణే సుతో ఘృతం న పవతే శుచి । ఆ భక్షత్కన్యాసు నః ॥
అర్థం
తనను తాను శుద్ధి చేసుకుని ఉబికిన సోమం , నెయ్యిలాగా మెరుస్తూ, మీ కోసం (పూషణుడు) ప్రవహిస్తున్నది.- అతను (పూషణుడు) మాకు కన్యలలో వాటా ఇస్తాడు.
---
పూషణుడు విడిగా ఒక దేవత కాదు, ఋగ్వేదంలో సంకేతంగా చెప్పిన అనేక పదాలలో ఇది ఒకటి. పూషణుడు అంటే, పరబ్రహ్మ యొక్క పోషణ శక్తి.
--
ఇందులో "భక్షత్కన్యాసు" అన్న పదాన్ని "భక్షత్ కన్యాసు" అనే పదాలుగా ఈ ఋక్కు యొక్క పదపాఠం తెలియజేస్తోంది.
"భక్షత్" అంటే తినుట, భాగము, భజించుట అనే అర్థాలు ఉన్నాయి.
"కన్యాసు" అంటే పురుష స్పర్శ లేని స్త్రీ(virgin), అమ్మాయి, కుమార్తె అనే అర్థాలు ఉన్నాయి.
ఋగ్వేదానికి మొదటగా భాష్యం తయారుచేసిన సాయనాచార్యులతో పాటు, దేశ విదేశాలకు చేందిన ముఖ్యమైన అనువాదకులందరు, పై ఋక్కు అనువాదంలో పొరపాటు పడినట్లు తోస్తోంది.
పై ఋక్కుకు శ్రీ అరవిందుల అనువాదం మాత్రం దొరకలేదు.
---
"భక్షత్" అంటే "భాగము" అనే అర్థము, "కన్యాసు" అంటే పురుష స్పర్శ లేని స్త్రీ(virgin) అనే అర్థాలు గ్రహించి, "(పూషణుడు) మాకు "కన్యలలో వాటా/భాగం" ఇస్తాడు", అని అనువదించారు.
సంకేతార్థంలో సోమం అంటే దివ్యమైన అనుభూతి. సోమం అంటే అధమపక్షం ఒక తీగ అనే అర్థం తీసుకున్నా, దానికి, మరియు చివరలో వచ్చే "కన్యలలో వాటా/భాగం" అనే దానికి పొసగలేదు.
--
నాకు అర్థమైనదిది.
ఉబికి, ప్రవహిస్తున్నద శుద్ధమైన సోమం అంటే "దివ్యమైన అనుభూతి" అని అనుకుంటే, అది ప్రతి ఒక్కరికి పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతి మాత్రమే! దానిని వేరెవరు స్పృశించలేరు.
కాబట్టి, "కన్యాసు" అంటే "వేరెవరు స్పృశించని అనుభూతి" అనే అర్థం తీసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment