Thursday, 13 February 2025

మృత్యుదేవతైన యముడు మొదటి జ్ఞాని మనువు ఒక్కరే

 

 ఋగ్వేదం 4.26.4లో ఒక దివ్యమైన పక్షి సోమం (అమృతం) మానవుడైన మనువు కు  అందించినట్లు ఉంది. 

ప్ర సు ష విభ్యో మరుతో విరస్తు ప్ర శ్యేనః శ్యేనేభ్య ఆశుపత్వా । 
అచక్రయా యత్స్వధయా సుపర్ణో హవ్యం భరన్మనవే దేవజుష్టమ్ ॥

ఓ మరుత్తులారా,చక్కటి రెక్కలుగల,రథం  అవసరం లేని, ఇతర గ్రద్దలకంటే వేగంగా ఎగిరే గ్రద్ద,   తన స్వతంత్ర శక్తితో   మనువుకు దేవతలకు ప్రీతికరమైన నైవేద్యాన్ని తెచ్చింది. 
 
------

పురాణాలలో వివరించిన మనువు చరిత్ర ప్రక్కన పెడితే,  మనువు అంటే  ఆధ్యాత్మిక ఉన్నతిని చేరిన   జ్ఞాని అనే అర్థం కూడా ఉంది. 

అంటే మానవులలొ మొదటిసారి జ్ఞాని స్థాయిని పొందినవాడు మనువు అని అనుకోవచ్చును. 

----

ఋగ్వేదం 10.14.2 లో  ఆధ్యాత్మిక  మార్గాన్ని మొదట కనుగొన్న వ్యక్తి యముడు అని ఉంది.     ఆ మార్గంలోనే ఆ తరువాత వచ్చిన జ్ఞానులు పయనించారు అని ఉంది. 


యమో నో గాతుం ప్రథమో వివేద నైషా గవ్యూతిరపభర్తవా ఉ । 
యత్రా నః పూర్వే పితరః పరేయురేనా జజ్ఞానాః పథ్యా అను స్వాః ॥

యమడు మొదట మనకు మార్గాన్ని కనుగొన్నాడు: ఈ పచ్చిక-భూమి తీసివేయబడదు.  మన పూర్వీకులు ఏ మార్గంలో వెళ్లిపోయారో, అదే మార్గంలో అప్పటి నుండి జన్మించిన  వారి స్వంత మార్గాల్లో అనుసరిస్తున్నారు.

అంటే తరువాత గ్రంథాలలో మృత్యుదేవుడిగా  వర్ణించబడ్డ యముడు,  మానవులలొ మొదటిసారి జ్ఞాని స్థాయిని పొందిన మనువు ఒక్కరే అయి ఉండాలి. 
 
 
 
 
------

అందుకనే ఏమో, కఠోపనిషత్తులో  నచికేతుడికి   జ్ఞాన ఉపదేశం యముడే చేస్తాడు.
 
 


 

No comments:

Post a Comment