Thursday, 11 December 2025

ఋగ్వేదంలో దేవీ సరస్వతీ పేర్లు



ఋగ్వేదంలో దేవీ సరస్వతీని ఇంకా రెండు పేర్లతో సంబోధించారు. ఎందువలనో ఋగ్వేదం తరువాతి తరంవారు, అంటే బ్రాహ్మణాలు/ఉపనిషత్తులను కూర్చిన తరంవారు, ఈ రెండు పేర్లను వదిలివేశారు.   

ఋగ్వేదం 1.3.11


చోదయిత్రీ సూనృతానాం చేతన్తీ సుమతీనామ్ । యజ్ఞం దధే సరస్వతీ ॥

ఇక్కడ చోదయిత్రీ అనే పదం సర్వనామము(pronoun)కానీ, క్రియాపదం (verb)కానీ కాదు, నామమే (name)!  దేవీ సరస్వతీకి బదులుగా  చోదయిత్రీ అనే నామము (noun) ఋషి వాడారు. 

చోదయిత్రీకి అర్థము చోదనము/కదలిక/ప్రేరణ కలిగించునది 

--

అలాగే, అత్రి ఋషి ఋగ్వేదం 5.41.19లో ఇళ,ఉర్వశీ, బృహద్దివ అనే స్త్రీ శక్తులను జ్ఞానం కోసం ప్రార్థించారు.

అభి న ఇళా యూథస్య మాతా స్మన్నదీభిరుర్వశీ వా గృణాతు । 
ఉర్వశీ వా బృహద్దివా గృణానాభ్యూర్ణ్వానా ప్రభృథస్యాయోః ॥

ఋగ్వేదంలో తఱచు కనిపించే మూడు స్త్రీ శక్తులు (తిస్రోదేవి) - ఇళ, సరస్వతీ, భారతీ/మహి.

*ఇళ* భూ తత్వంలో వ్యాపించి ఉంటుంది.  *సరస్వతీ* మధ్యస్థాయి/అంతరిక్షంలో వ్యాపించి ఉంటుంది, *భారతీ/మహి* ఆపై స్థాయిలో వ్యాపించి ఉంటుంది. 

పైన ఉటంకించిన ఋక్కులో మొదట *ఇళ* కనిపిస్తుంది.  

*బృహద్దివ* అంటే *బృహత్* + *దివ* - అంటే *భారతీ/మహి*.

ఇంక మిగిలిన పదం *ఉర్వశీ - వ్యాపించిన* అనే అర్థంతో వాడారు. అంటే *సరస్వతీ*.

---

పురాణాల తరంవారు, *ఉర్వశీ* ని కాస్తా *ఊర్వశీ* గా మార్చి, దేవ వేశ్యగా వర్ణించారు. 

వారినేమనాలో తెలియడంలేదు.